కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టి కర్నూలు జిల్లాలో 75 కోట్ల రూపాయలతో 117 కిలోమీటర్లు సీసీ రోడ్ల నిర్మాణం సాధ్యమయ్యిందని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణం పూర్తి అయింది దీనికి కలెక్టర్ రంజిత్ బాషా గారికి నా అభినందనలు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ పని చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పల్లె పండుగ విజయవంతం అయింది. బలమైన, అనుభవశీలి అయిన సీఎం ఉంటె నాలాంటి వారు నేర్చుకుంటారు.మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోడానికి నేనెప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయితీలకు ఇప్పటిదాకా చాలా తక్కువ నిధులు ఇచ్చేవాళ్ళు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాకా సీఎం చంద్రబాబు నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయితీరాజ్ వ్యవస్థని పటిష్ఠం చేసేందుకు అవకాశం ఇస్తున్న ఆయన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పల్లె పండుగ, జాతీయ ఉపాధి హామీ పథకాల అమలు, రోడ్ల నిర్మాణాలు ఇంత సమర్ధవంతంగా చేయడానికి ఇద్దరు కారణమని ఆ ఐఏఎస్ అధికారులు శశి భూషణ్ గారు, కృష్ణ తేజ అని వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక తెగించి రోడ్ల మీదకు నాయకులు ఒస్తే వెనక మీరు ఉండబట్టే 175 కి 164 అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు గెలవగలిగామని మూడు పార్టీల అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు.కొణిదెల గ్రామ అభివృద్ధికి 50 లక్షల సొంత నిధులు ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read
Previous Articleఆ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యా: పృథ్వీ రాజ్ సుకుమారన్
Next Article ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోకు భారీ ధర..!

