సూపర్ స్టార్ మహేష్ బాబు ,దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలున్నాయి. ‘బాహుబలి’ 1&2, ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజమౌళి తెరకెక్కిస్తున్నందున సినీ ప్రియుల దృష్టి ఈచిత్రం పై ఉంది. ఇక ఇందులో మహేష్ కు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టులో మళయాళ నటుడు, దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా భాగమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. లీక్ వీడియోలు చూడడానికి ప్రేక్షకులు ఎందుకు ఉత్సాహంగా ఉంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందులో గొప్పతనం ఏముంటుంది. అవి చూడడం వల్ల మీరు ఇంట్రస్ట్ కోల్పోతారు. తెరపై ఆ సన్నివేశాన్ని ఆస్వాదించలేరు. రాజమౌళి సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేను. త్వరలోనే దీనిపై టీమ్ నుండి అప్డేట్స్ రావాలని కోరుకుందాం . నేను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యాను. అప్పటినుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నామని పృథ్వీరాజ్ తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు