స్వాతంత్య్ర సమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షహీద్ దివస్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ లు ఘనంగా నివాళులు అర్పించారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
భరతజాతికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడానికి 23 యేళ్ళ వయసులోనే వీరోచిత పోరాటాలు చేసి.. యువ హృదయాలపై చెరగని ముద్ర వేసిన స్వాతంత్య్ర సమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షహీద్ దివస్ సందర్భంగా… ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ, వారి స్మృతికి నివాళులర్పిద్దాం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:
షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్‌లకు నా హృదయపూర్వక నివాళి, వారి త్యాగం కేవలం స్వాతంత్ర్యానికే కాక, ప్రతి భారతీయునిలో ధైర్యం మరియు ఆత్మనిర్భరతా ఆత్మను మేలుకొలపడానికి స్పూర్తినిస్తూనే ఉంటుంది. వారి సిద్ధాంతాలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయి.
మంత్రి నారా లోకేష్:
దేశ స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడి అమరులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల త్యాగాలను స్మరించుకుంటూ షహీద్ దివస్ సందర్భంగా ఆ మహనీయులకు ఘననివాళి అర్పిస్తున్నాను. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారుచేసిన సాహసాలు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలిచాయి. వారి ఆశయ సాధన కోసం పునరంకితమవుదాం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు