నేడు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ. శే శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబుగారికి, జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, నాయకులకు, కార్యకర్తలకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Previous Articleతెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనం: నారా లోకేష్
Next Article భారత రెజ్లర్ మనీషా బల్వాలాకు గోల్డ్ మెడల్