విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఉగాది పచ్చడిని స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, అధికారులు పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులకు సీఎం చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నాగరికత, సంస్కృతి మరిచిపోతే మన ఉనికిని కోల్పోతాం. నాగరికత, సంస్కృతిని అనుసంధానిస్తూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ఈ రోజు మార్గదర్శి – బంగారు కుటుంబం పేరుతో పీ-4 కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.


