ఈ రోజు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ప్రజాప్రతినిధులు, నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు:

ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో ముగిసింది. జకాత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం. పేద కుటుంబాల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయవల్ల విజయవంతం కావాలని కోరుకుంటూ.. అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:

ఇస్లాంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ఖురాన్ అవతరించిన పవిత్ర మాసం ఇది. ఉపవాస దీక్షలు ముగించి ఈదుల్ ఫితర్ వేడుకకు సన్నద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
మంత్రి నారా లోకేష్:

ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసం. ముస్లిం సోదరులందరికీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు. అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలి. ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్:

భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

