మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆరోగ్యానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల 26న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆయనను వారి కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే, ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రి వైద్యులు కొడాలి నాని హెల్త్ బులిటిన్ ను విడుదల చేశారు.
కాసేపట్లో ఆయనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించారు. నాని హార్ట్ లో మొత్తం మూడు వాల్స్ మూసుకుపోవడంతో క్రిటికల్ సర్జరీ చేసి స్టంట్ అమర్చడం లేదా బైపీస్ సర్జరీ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబయి తరలించనున్నారని తెలుస్తోంది.
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి వెంకటేశ్వరరావు (నాని) హెల్త్ కు సంబంధించి కీలక అప్డేట్
By admin1 Min Read