ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఆయన పనులు అద్భుతంగా ఉంటాయని కొనియాడారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అరకు కాఫీ కోసం ఏపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వీలైన చోటల్లా ఈ కాఫీకి గుర్తింపు తీసుకొచ్చే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇక ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ అరకు కేఫ్ లు విస్తరిస్తున్న తీరును చూసి ఆయన సంతోషిస్తారని పారిస్ కేఫ్ ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్స్ పై అరకులోని గిరిజనుల లైఫ్ స్టైల్ కు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇక్కడి కాఫీ ప్యాకేజింగ్ ను గిరిజనుల వేషధారణ, భారతదేశంలోని వైవిధ్యమైన రంగుల స్ఫూర్తితో రూపొందించినట్లు వివరించారు. ఇక ఇంతకుముందు కూడా ఆనంద్ మహీంద్రా ‘ఎక్స్’లో ఆసక్తికర పోస్టు పెట్టారు. పారిస్ లో మన రెండో అరకు కాఫీ స్టాల్’ అంటూ వీడియో పెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

