మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన తాజా చిత్రం ‘L2 ఎంపురాన్’ పై వచ్చిన వివాదానికి సంబంధించి క్షమాపణలు తెలిపారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు గుజరాత్ అల్లర్లను సూచిస్తూ ఒక వర్గాన్ని అవమానకరంగా చూపించాయని విమర్శలు వచ్చాయి.దీనిపై సెన్సార్ బోర్డ్ 17 కట్స్ సూచించగా, తాజాగా మోహన్‌లాల్ కూడా వివాదంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ,‘‘చిత్రంలోని కొన్ని రాజకీయ,సామాజిక అంశాలు కొందరిని నొప్పించాయి. నా సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని,భావజాలాన్ని లేదా మతాన్ని అవమానించకుండా జాగ్రత్తపడటం నా బాధ్యత’’ అని పేర్కొన్నారు.అందుకే తన చిత్రం బృందం తరఫున క్షమాపణలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.2019లో విడుదలైన ‘లూసిఫర్’ గా వచ్చిన ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న ఈ చిత్రం మలయాళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

