కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన వివిధ పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కాంగ్రెస్, శివసేన (యూబీటీ), సీపీఎం సహా ఇతర విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ బిల్లును రేపు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి నేతలు అత్యవసరంగా సమావేశమై లోక్‌సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.చర్చలో పాల్గొనాలని, కానీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, “మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన విధానాలను అనుసరిస్తోంది.విభజన ఎజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయి” అని స్పష్టం చేశారు.వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయని ఖర్గే వ్యాఖ్యానించారు.ఈ అంశంపై లోక్‌సభలో ఉత్కంఠభరితమైన చర్చ జరిగే అవకాశముంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

