లోక్ సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు తెలియచేస్తోందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోందని ఈ మేరకు లోక్ సభలోని జనసేన ఎంపీలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని పేర్కొంది. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలని జనసేన పార్లమెంట్ సభ్యులకు తెలిపారని ‘వక్స్ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి సమీక్షించారని వివరించింది. సంబంధిత వర్గాలతో, విద్యావంతులతో, పాలన రంగ నిపుణులతో చర్చించి ఈ బిల్లును రూపొందించారు. బ్రిటిష్ కాలంనాటి వక్ఫ్ చట్టాన్ని నేటి కాలానికి తగిన విధంగా క్రమబద్ధీకరించడం ద్వారానే విస్తృత ఫలితాలు దక్కుతాయని ఈ క్రమంలో వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారని జనసేన పేర్కొంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు