అమెరికాలో పర్యటనకు బయలుదేరిన ఓ భారీ షిప్ లో నోరో వైరస్ కలకలం రేపింది. ఈ పెద్ద షిప్ లో దాదాపు 200 మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారని తేలింది. సౌతాంప్టన్ నుండి బయలుదేరిన షిప్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో ఈ షిప్ న్యూయార్క్ చేరుకున్న తర్వాత ప్రయాణికులకు నోరో వైరస్ సోకిన విషయాన్ని మెడికల్ సిబ్బంది గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులకు ట్రీట్మెంట్ అందించడంతో పాటు షిప్ ను పూర్తిగా శానిటైజ్ చేసినట్లు తెలిపారు. ఈ టూరిస్ట్ షిప్ మార్చి 8న 2,538 మంది టూరిస్టులు, 1,232 మంది స్టాఫ్ తో సౌతాంప్టన్ నుండి ఈస్ట్ కరేబియన్ ఐలాండ్స్ కు బయలుదేరింది. మార్చి 18న న్యూయార్క్ లో ఆగింది. అప్పటికే పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో డాక్టర్ లు వారిని పరీక్షించారు. మెడికల్ టెస్ట్ ల్లో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది నోరో వైరస్ బారినపడినట్లు నిర్ధారించారు. బాధితులకు ట్రీట్మెంట్ అందించి, మిగతా ప్రయాణికులకు వైరస్ సోకకుండా షిప్ ను శానిటైజ్ చేశామని అధికారులు తెలిపారు.
భారీ టూరిస్ట్ షిప్ లో ‘నోరో వైరస్ ‘ కలకలం…200 మందికి పైగా అస్వస్థత
By admin1 Min Read