డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనూ… స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆ అభ్యుదయ నాయకుని స్మృతికి నివాళులు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూజీ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం. జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
బాబూజీ స్ఫూర్తిగా బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read