మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ నేడు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లి పర్యటించారు. వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే బీహార్‌లా ఉంది. దిగజారిన రాజకీయ పరిస్థితులు, రెడ్‌బుక్ పరిపాలన ఎలా కొనసాగనిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో తనకు బలం లేకపోయినా హింసను, ప్రలోభాలను ప్రోత్సహిస్తూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైయస్ఆర్ సీపీ గెలిచింది. ముఖ్యమంత్రి అనే అహంకారంతో ఏ పదవైనా నాకే కావాలంటూ లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేస్తూ చంద్రబాబు దౌర్జన్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రామగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అన్యాయాలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా స్థానిక ఎన్నికలన్నింటిలో దౌర్జన్యాలతోనే గెలవాలని చూస్తున్నారని రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయాలని హితవు పలికారు. చంద్రబాబు మెప్పుకోసం పనిచేస్తున్న పోలీసులకు చెబుతున్నా ఎల్లకాలం చంద్రబాబు పరిపాలన సాగదు..మీ యూనిఫాం తీయించి..దోషులుగా మిమ్మల్ని నిలబెడతామని మీరు చేసిన ప్రతి పనినీ వడ్డీతో సహా లెక్కేసి మీతో కక్కిస్తాంమని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే బీహార్‌లా ఉంది: మాజీ సీఎం వైఎస్ జగన్
By admin1 Min Read