కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర “బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణం” అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి. మహిళల భద్రతను తేలికగా తీసుకున్నట్లు భావించిన నెటిజన్లు, మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో, ఆయన స్పష్టీకరణ ఇచ్చి క్షమాపణలు చెప్పారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరికైనా బాధ కలిగించి ఉంటే విచారిస్తున్నానని పేర్కొన్నారు.బెంగళూరులో ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళల భద్రత కోసం నిర్భయ నిధులు సమర్థవంతంగా వినియోగిస్తున్నామని హోంమంత్రి పేర్కొన్నారు. అయితే, మంత్రిగా బాధ్యతగల పదవిలో ఉన్న పరమేశ్వర ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
లైంగిక వేధింపులపై కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు – విమర్శల నేపథ్యంలో క్షమాపణ..!
By admin1 Min Read