ఫిర్యాదుల పరిష్కారాల్లో వేగం పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రీవెన్స్‌లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వినతుల స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లోనే అత్యధిక ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు గ్రీవెన్స్ స్థితిని తెలియజేసే సమాచారం అందించాలని, ఇందుకోసం ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. పరిష్కరించగలిగే వినతులను నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. అలాగే పరిష్కరించలేని వినతుల విషయంలో ఫిర్యాదుదారులకు ఎందుకు పరిష్కరించలేకపోతున్నామనే విషయాన్ని సవివరంగా తెలియజేయాలని పేర్కొన్నారు. నేరుగా వచ్చే గ్రీవెన్స్‌లను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా కంప్లైంట్ చేసిన వారిని సంప్రదించి ఫాలోఅప్ చేయడం ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం సూచించారు.
Previous Articleమళ్లీ ఓడిన చెన్నై… పంజాబ్ కింగ్స్ ఖాతాలో మరో విజయం
Next Article ఈ నెల 15 నుంచి ‘ఇంటింటికీ మన మిత్ర’

