ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమి చవిచూసింది. తాజాగా న్యూ చండీఘర్ ముల్లాన్ పూర్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా, పంజాబ్‌కు ఇది మూడో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 8 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టును యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య ఆదుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ చెన్నై బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. 39 బంతుల్లోనే సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 42 బంతులు ఆడిన ప్రియాంశ్ 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో శశాంక్‌సింగ్ (52), మార్కో జాన్సెన్ (34) కూడా ధాటిగా ఆడడం తో బ్యాట్ ఝళిపించారు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చెన్నై లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (36), డెవోన్ కాన్వే (69) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) నిరాశ పరిచాడు. శివం దూబే (49), ధోనీ (27) పోరాడారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2 వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో అదరగొట్టిన ప్రియాంశ్ ఆర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు