రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు . ఈసందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. అంబేడ్కర్ చిత్రపటాల ప్రదర్శనను చూశారు. అనంతరం పీ4 కార్యక్రమాల లబ్దిదారులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మార్గదర్శులు, బంగారు కుటుంబం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. విదేశీ విద్యాదీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎస్సీల ఆదాయం పెంచే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని కోరారు.
విజన్ 2047 ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం కృషి చేస్తున్నాం. ప్రపంచంలో చాలా మంది తెలుగువారు ఉన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. మార్గదర్శి, బంగారు కుటుంబంలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కోసం పీ4 తెచ్చాం. ప్రైవేటు భాగస్వామ్యంతో పేదల జీవితాలు మార్చడం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పొన్నెకల్లులో ఇంకా 300 మందికి మరుగుదొడ్లు లేవు, 6 నెలల్లో నిర్మిస్తాం. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేడ్కర్ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్ సభ స్పీకర్ గా చేసిన పార్టీ టీడీపీనేనని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయి. దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వారికి 8 లక్షల ఎకరాలను టీడీపీ ప్రభుత్వం గతంలో పంపిణీ చేసిందని చంద్రబాబు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు