వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటూ ఓటు బ్యాంకు వైరస్ ను వ్యాప్తి చేసిందని అన్నారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేస్తున్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎందుకు వారికి పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ముస్లిం అభ్యర్థులకు 50 శాతం టికెట్లు ఎందుకు రిజర్వ్ చేయలేదని దుయ్యబట్టారు. హార్యానా లోని హిస్సార్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ఈ ఎయిర్ పోర్ట్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ ను ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన పాటించిన విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. అయితే దేశ ప్రజల కోసం ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అధికారం పొందేందుకు ఒక సాధనంగా వాడుకుంటోందని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అధికారాన్ని నిలుపుకోవడానికి రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ విలువల గురించి ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ వాటిని పాటించలేదన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు