కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు. ‘ది ఫోరం ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్’ సంస్థ అవార్డు కేంద్ర మంత్రికి దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 116 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మరో ఆరుగురు భారతీయులు స్థానం సంపాదించుకున్నారు. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసి, ప్రపంచ స్థితిగతుల అభివృద్ధికి కృషి చేసిన 40 ఏళ్ల లోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్ సంస్థ పురస్కారాలతో గౌరవిస్తుంది. కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నిపున్ మల్హోత్రా, రితేష్ అగర్వాల్, అనురాగ్ మాలూ, అలోక్ మెడికేపుర అనిల్, మానసి సుబ్రమణ్యం, నటరాజన్ శంకర్ లు ఈ జాబితాలో భారత్ నుండి ఉన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కు ‘ది ఫోరం ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డు
By admin1 Min Read