నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు, నేతలు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ లు చేశారు. క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సర్వమానవ సమానత్వాన్ని, శాంతిని నెలకొల్పేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
లోకానికి శాంతి దూతగా వచ్చిన ఏసుక్రీస్తుకు కల్వరి గిరిపై శిలువ వేసిన శుక్రవారం రోజును గుడ్ ఫ్రైడే గా నిర్వహిస్తాం. శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఆ దేవదూత శాంతినే ప్రబోధించాడు. అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయం. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే ఈ పవిత్రదినం రోజు ఉపవాసం ఉండి ఆయనకు నివాళి అర్పించడం క్రైస్తవ సోదరులు పాటించే ఆచారం. క్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన బోధనలు పాటిస్తూ సర్వమానవ సమానత్వాన్ని, శాంతిని నెలకొల్పేందుకు కృషి చేద్దాం.
మంత్రి నారా లోకేష్:
మానవాళిని పాపాల నుంచి విముక్తం చేయడానికి శిలువ ఎక్కారు ప్రభువైన యేసుక్రీస్తు. తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాలనూ, దోషాలనూ ప్రక్షాళన చేశారు. శాంతి, క్షమల సందేశాన్ని తన త్యాగంతో యేసుక్రీస్తు చాటిచెప్పిన పవిత్రమైన రోజే గుడ్ ఫ్రైడే.
Previous Articleమళ్లీ భారీ లాభాలు…78 వేల ఎగువకు సెన్సెక్స్..!
Next Article సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ గెలుపు..!