భూ దందాలు చేస్తే సహించేది లేదని.. కూటమి పాలనలో ప్రజల ఆస్తులకు భరోసా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయానికి విశాఖ, కాకినాడ, కడప, తిరుపతి ప్రాంతాల నుంచి అర్జీలు వస్తున్న నేపథ్యంలో వీటిపై తన కార్యాలయ అధికారులతో పవన్ సమీక్షించారు. కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలు కావచ్చు, వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు… వాటిని కాపాడుకోవడం కోసం సామాన్యులుపడుతున్న ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ప్రజల ఆస్తులకు కూటమి పాలంలో భరోసా కల్పించే విధంగా చర్యలు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. భూ దందాలు చేసినా, తప్పుడు దస్తావేజులు సృష్టించినా, కబ్జాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు.
సీఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆస్తులకు రక్షణ ఇస్తుందని పేర్కొన్నారు. అక్రమాలు చేసేవారిపై కూటమి కఠినంగా ఉంటుంది. ప్రజల నుంచి ఇప్పటికీ అలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. కచ్చితంగా తినే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్ళి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి బాధలు తెలుసుకొని, భరోసా ఇస్తానని పేర్కొన్నారు. కూటమి నేతల మూలంగా వారు ఇబ్బందిపడ్డా ఉపేక్షించకుండా చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగుతుందని ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులతో చర్చిద్దామన్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయం దృష్టికి వచ్చిన ఫిర్యాదులను వారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రక్రియ చేపట్టాలన్నారు.
భూ దందాలు చేస్తే సహించేది లేదు…కూటమి పాలనలో ప్రజల ఆస్తులకు భరోసా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read