కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బారువా బీచ్‌లో, ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలు తీరం నుండి సముద్రంలోకి మొదటి అడుగులు వేసిన క్షణం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించి నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ అరుదైన జాతి పరిరక్షణ మరియు రక్షణ గురించి అవగాహన పెంచే లక్ష్యంతో జరిగిన ఆలివ్ రిడ్లీ తాబేలు ఉత్సవంలో భాగంగా ఈ చిరస్మరణీయ కార్యక్రమం నిర్వహించినట్లు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ , జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిన్న ప్రాణాలను సముద్రంలోకి తీసుకురావడానికి అన్ని విధాల కృషి చేసిన ప్రతి ఒక్కరికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలోకి విడుదల చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read