అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరుకానున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు 90 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే నెల 2న ప్రధాని చేతుల మీదుగా అమరావతి అభివృద్ధి పనులు పునఃప్రారంభం కానున్నాయి. సభకు వచ్చే మార్గాల్లోని 8 ప్రధాన రహదారులను మరియు 11 పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాం.కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతులు ప్రభుత్వానికి సమర్పించారు.సభ వేదిక వద్ద రైతులను గౌరవించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. సభ కోసం మొత్తం మూడు స్టేజ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అదనపు భూముల కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయి.ప్రజలు ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరిస్తే కొనసాగిస్తాం, లేదంటే భూసేకరణ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రాబోయే 100 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని సీఎం గారు అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు