స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొని, దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించి, భవిష్యత్ ప్రణాళికలను తన ప్రసంగం ద్వారా వెల్లడించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక పటుత్వం అవసరమని పేర్కొన్నారు. స్వయంప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు సూచించారు.రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. ఉపాధి కూలీలను ఇక మీదట ఉపాధి శ్రామికులుగా పిలుద్దామని అన్నారు. పంచాయతీల స్థలాలు, ఆస్తులు, భవనాలకు ఆడిట్ జరగాలని స్పష్టం చేశారు. ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం, స్థూపం నిర్మించేలా ప్రణాళిక వేస్తున్నట్లు వివరించారు. తానెప్పుడూ గ్రామీణ మనస్తత్వం ఉన్న సగటు వ్యక్తినేనని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన వివిధ విభాగాలలో ప్రతిభ చూపించిన అధికారులకు అవార్డులు అందించారు. ఇక పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు.
స్వావలంబనతో ముందుకు సాగాలి…జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read