ఏపీ మంత్రి నారాయణ కుమార్తె, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు డాక్టర్ శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి కాపీని చిరంజీవికి అందించారు. అనంతరం, రచయిత డాక్టర్ శరణికి, మంత్రి నారాయణకు, గంటా శ్రీనివాసరావుకు కూడా కాపీలు అందించారు. అంతకుముందు, వేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమం విజయవాడ లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగింది. వేదికపై చిరంజీవి, చంద్రబాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ…ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read