ఐపీఎల్ సీజన్ 18 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఎట్టకేలకు తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో విజయాన్ని అందుకుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 11 పరుగుల తేడాతో గెలిచింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్‌ను 194 పరుగులకే కట్టడి చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (70), దేవదత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (26), టిమ్ డేవిడ్ (23), జితేశ్ శర్మ (20) పరుగులు చేశారు. ఆర్ఆర్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు జైస్వాల్, సూర్యవంశీ శుభారంభం అందించారు. జైస్వాల్ 49, ధ్రువ్ జురేల్ 47, నితీశ్ రాణా 28, రియాన్ పరాగ్ 22 పరుగులతో పర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా… కృనాల్ పాండ్యా 2, భువనేశ్వర్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు.
Previous Articleమైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ…ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సీఎం చంద్రబాబు
Next Article భారత్ కు మరోసారి సంపూర్ణ మద్దతు తెలిపిన అమెరికా