చెన్నై సూపర్ కింగ్స్:154-10 (19.5)
సన్ రైజర్స్ హైదరాబాద్:155-5 (18.4)
ఐపీఎల్ లో 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత చెన్నై లోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ పై హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజాగా నేడు జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందు బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 154 పరుగులకే కట్టడి చేశారు. డెవాల్డ్ బ్రెవిస్ 42 (25; 1×4, 4×6), ఆయుష్ మాత్రే 30 (19; 6×4), దీపక్ హుడా 22 (21; 1×4, 1×6), రవీంద్ర జడేజా 21 (17; 1×4, 1×6) పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో హార్షల్ పటేల్ 4 వికెట్లు, కమ్మిన్స్ 2 వికెట్లు, ఉనద్కత్ 2 వికెట్లు, కమిందు మెండీస్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని హైదరాబాద్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇషాన్ కిషన్ 44 (34; 5×4, 1×6) టాప్ స్కోరర్. కమిందు మెండీస్ 32 నాటౌట్ (22; 3×4), నితీష్ రెడ్డి 19 నాటౌట్ (13; 2×4) జట్టు గెలుపులో తమదైన పాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, కాంబోజ్, జడేజా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.