ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత కల్పించేందుకు యునిసెఫ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, యూనిసెఫ్ కలిసి 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలు యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ (YFSI), యూత్ హబ్, పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E)ను ప్రారంభించడం జరిగింది. ఇవి యువతలో నవీన ఆవిష్కరణలు, స్థిర జీవనోపాధి అవకాశాలను పెంపొందిస్తాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2 లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉద్యోగ సృష్టి, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అందించేందుకు శిక్షణ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతీ, యువకులకు స్కిల్ డెవలప్మెంట్, సాధికారత కోసం యునిసెఫ్ తో ఒప్పందం
By admin1 Min Read