కేంద్ర కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు సమావేశమైన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతోపాటే కులగణన చేయాలని నిర్ణయం వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సర్వేలకు బదులుగా పారదర్శకమైన విధానం ద్వారా కుల గణనను చేపట్టనున్నారు. ఇక సిల్చార్-షిల్లాంగ్ కారిడార్ నిర్మాణం, చెరుకు కనీస మద్దతు ధర పెంపు, అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. సిల్చార్-షిల్లాంగ్ కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది . 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం, చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్వింటాకు రూ.355 ఎస్ఆర్పీ పెంపు వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు