శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంకోజి సుమ అనే మహిళ తన కుమారుడికి ఉపాధి మార్గం చూపించాలని విన్నవించగా వ్యవసాయ శాఖ నుంచి డ్రోన్ అందించి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కాలనీ వాసుల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read