ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులు అట్టహాసంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మరియు రాజధాని ఆశలను తుడిచిపెట్టిందని పరదాల మాటున పరిమాణ సాగింది. రైతుల త్యాగాలను స్మరించుకుని, వారికి ధన్యవాదాలు తెలుపాల్సిన బాధ్యత ఉంది. వారి త్యాగాన్ని గుర్తిస్తూ, జవాబుదారీగా వ్యవహరిస్తూ రాజధాని నిర్మాణం జరిగేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా 140 కోట్ల భారతీయుల కోసం అనుక్షణం కష్టపడుతున్న గొప్ప నాయకుడు ఆయన మన కష్టాలను, రైతుల పోరాటాన్ని అర్థం చేసుకుని ఈరోజు అమరావతి పునః ప్రారంభం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చినందుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల త్యాగాన్ని గుర్తిస్తూ, జవాబుదారీగా వ్యవహరిస్తూ రాజధాని నిర్మాణం: డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read