అమరావతి పునః ప్రారంభోత్సవ సభలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గత ఐదేళ్లుగా అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉంటే ప్రధాని మోడీగారి వ్యక్తిగత శ్రద్ధతో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందించిందని అన్నారు. ఒక్క అమరావతి నిర్మాణమే కాదు… రాష్ట్రంలో 26 జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామని పునరుద్ఘాటించారు. ఈరోజు అమరావతి పునర్నిర్మాణం జరుపుకుంటుంది అంటే, అది అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమించిన రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళల విజయమని పేర్కొన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇక్కడ కనీసం 5 లక్షల మంది పిల్లలు చదువుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఈరోజు అమరావతి పునర్నిర్మానాన్ని ప్రారంభించడానికి వచ్చిన మోడీ గారిని మూడేళ్ళ తర్వాత అమరావతి నగరాన్ని ప్రారంభించడానికి మళ్ళీ రావాలని కోరారు. ఇక ఐటీ విప్లవానికి నాంది పలుకుతూ గతంలో హైదరాబాద్‌లో నిర్మించిన హైటెక్ సిటీని నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించారు. అదే స్ఫూర్తితో ఏఐ రంగంలో దూసుకుపోయేందుకు అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒక్క అమరావతే కాదు… రాష్ట్రంలో 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం:ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleరైతుల త్యాగాన్ని గుర్తిస్తూ, జవాబుదారీగా వ్యవహరిస్తూ రాజధాని నిర్మాణం: డిప్యూటీ సీఎం పవన్
Next Article ‘జైలర్ – 2’లో బాలయ్య ఫోటో లీక్…!