‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ఈనెల లోనే ప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కడపలో ఈ నెల 27,28,29 మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘మహానాడు’ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 18 నాటికి రాష్ట్రస్థాయి కమిటీలు మినహా మిగితా కమిటీలు వేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వచ్చే నెల 12 నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇక ఇటీవల అమరావతి పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రపంచం దృష్టి రాజధానిపై పడిందని పేర్కొన్నారు. ఇక మరో కీలక ప్రజా సంక్షేమ కార్యక్రమం ‘తల్లికి వందనం’ ను స్కూల్స్ ప్రారంభానికి ముందే రూ. 15వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. పెన్షన్లు, పోలవరం అభివృద్ధి, దీపం-2, మెగా డీఎస్సీ, వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు