ప్రపంచం లోనే అత్యంత విలువైన వజ్రమైన కోహినూర్ తిరిగి తన స్వదేశమైన భారత్ కు చేరుకునే అవకాశం ఉందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది సాధ్యపడవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటన్ మహారాణి కిరీటంలో పొదిగి ఉన్న ఆ వజ్రాన్ని భారత్ కు తిరిగి ఇచ్చేస్తారా? అనే ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక మంత్రి లీసా నాండీ తాజాగా స్పందించారు. భారత్-బ్రిటన్ ల మధ్య సాంస్కృతిక కళాకండాల మార్పిడి కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చనే ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ అంశంపై భారత సాంస్కృతిక శాఖతో కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె అధికారిక పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీలో మాట్లాడారు.
Previous Articleఅన్నదాత సుఖీభవ సంక్షేమ కార్యక్రమం ఈ నెలలోనే:ఏపీ సీఎం చంద్రబాబు
Next Article దిగుమతుల నిషేధంతో పాక్ అడ్డదారులు..!