చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు “ఆపరేషన్ సిందూర్” కొనసాగాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రక్షణ బలగాల వెనుక 140 కోట్ల భారతీయులు ఉన్నారని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రధాని మోడీ తీసుకునే నిర్ణయాలకు యావత్ జాతి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు. భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు “ఆపరేషన్ సిందూర్” కొనసాగాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
By admin1 Min Read