స్పేస్ సెక్టార్ లో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో ‘గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్’ సందర్భంగా ఆయన ప్రసంగించారు. భారత్ చేపట్టిన మంగళ్ యాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాల గురించి ప్రస్తావించారు. విజయవంతంగా వీటిని భారత్ చేసిందన్నారు. చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై నీటి జాడను కనుగొన్నామని పేర్కొన్నారు. సౌత్ ఆసియా దేశాల కోసం ప్రత్యేక శాటిలైట్ ప్రయోగించినట్లు గుర్తు చేశారు. త్వరలో భారత ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) రోదసి లో పర్యటిస్తాడని స్పష్టం చేశారు. 2050 నాటికి చంద్రుడిపై భారతీయులు అడుగు పెడతారని పేర్కొన్నారు. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ ఈనెల 9వరకు జరగనుంది.
2050 నాటికి చంద్రుడిపై భారతీయుడు:గ్లోబల్ స్పేస్ ఎక్స్పో లో ప్రధాని మోడీ
By admin1 Min Read

