ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు:
వివిధ పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. టూరిజం పాలసీకి అనుగుణంగా ప్రోత్సాహకాలు.
డైకిన్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థకు శ్రీసిటీలో విస్తరణకు అనుమతి.
ప్రాజెక్టు వయబిలిటీ దృష్టిలో ఉంచుకుని తిరిగి 500 ఎకరాలు కేటాయింపు.
సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. త్వరలోనే విద్యుత్ ఇంధన వనరుల కేంద్రంగా అనంతపురం.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏలూరులో ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయం.
అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లా యూనివర్సిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం. 20 శాతం సీట్లు ఏపీ విద్యార్థులకు కేటాయించేలా రిజర్వేషన్.