ఈ ఐపీఎల్ సీజన్ లో పేలవంగా ఆడుతూ వస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్ లో ఆ జట్టుకు ఇది10వ పరాజయం. 13 మ్యాచ్ లలో కేవలం 3 మాత్రమే గెలిచింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. ప్లే ఆఫ్ రేసు కు దూరమైన ఆ జట్టు నామమాత్రపు గెలుపుతో సీజన్ కు గుడ్ బై చెప్పేసింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆయుష్ మాత్రే 43 (20; 8×4, 1×6), బ్రెవిస్ 42 (25; 2×4, 3×6), శివమ్ దూబే 39 (32; 2×4, 2×6) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో వై.సింగ్ 3 వికెట్లు, మధ్వాల్ 3 వికెట్లు, తుషార్ దేశ్ పాండే 1 వికెట్, హాసరంగా 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవన్షీ 57 (33; 4×4,4×6) మరోసారి తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. యశస్వీ జైశ్వాల్ 36 (19; 5×4, 2×6), సంజూ శాంసన్ 41 (31; 3×4, 2×6), ధ్రువ్ జురెల్ 31 నాటౌట్ (12; 2×4, 3×6) రాణించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు, నూర్ అహ్మద్ 1 వికెట్, కాంబోజ్ 1 వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు