గత ప్రభుత్వం రేషన్ వ్యాన్ల పేరుతో బియ్యం స్మగ్లింగ్ చేసారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇకపై రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు ఇస్తామని చెప్పారు. వ్యాన్ కోసం ఎదురు చూడటం, వీధి చివర నుంచోవటం, సెలవులు పెట్టి వ్యాన్ ఎప్పుడు వస్తుందా? అని వేచి చూడాల్సిన అవసరం లేదని ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ షాపుకి వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చని తెలిపారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వారికి మాత్రం ఇంటి వద్దే రేషన్ ఇస్తాం.ముమ్మిడివరం నియోజకవర్గం, చెయ్యేరులో ప్రజావేదిక సభకు చంద్రబాబు హాజరై పెన్షన్ లబ్ధిదారులు, మహిళలతో మాట్లాడారు. సభకు హాజరైన ప్రజలకు ఆత్మీయ అభివాదం చేశారు. కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను వివరించారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ గారి స్పూర్తితో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. ఇటీవల పాస్టర్ మరణాన్ని కూడా హత్య అంటూ నీచ రాజకీయం చేసారు. తిరుమలలో కూడా రోజుకొక ఫేక్ న్యూస్ వేస్తున్నారని సమాజంలో అశాంతి రేకెత్తించాలని ప్రయత్నం చేస్తే, తప్పు చేసిన వారి పట్ల చండశాసనుడిగా ఉంటానని హెచ్చరించారు. కొందరు స్వార్థపరులు విగ్రహాలతో రాజకీయాలు చేసి, కుల కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వార్థపరులు చేసే పనులకు ఎమోషనల్ అయి ప్రతిస్పందించొద్దని కోరారు . వాళ్ళ సంగతి తాను చూస్తానని తెలిపారు. ఇక ఉపాధి హామీ పని దినాలు, హాజరవుతున్న శ్రామికులు గురించిన సమాచారం సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పింఛన్ లబ్ధిదారులైన మహిళలతో మాట్లాడారు. పెంచి ఇస్తున్న పింఛన్ తమ కన్నబిడ్డల్లా ఆదుకుంటుందని మహిళలు ఈసందర్భంగా సీఎంకి వివరించారు.ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇది పేదల ప్రభుత్వం…చెయ్యేరులో ప్రజావేదిక సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read