అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక దీని నిర్మాణానికి మూడు సంస్థలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక సంస్థలైన టీసీఎస్, ఎల్అండ్ టీ, ఐబీఎం సంస్థలు దీన్ని నిర్మించనున్నాయి. క్వాంటం పార్క్ ఐబీఎం.. 156 క్యూబిట్ క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలు అందించనుంది. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది.
అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఐటీ శాఖ ఉత్తర్వులు
By admin1 Min Read