ఇటీవల ఒక మీడియా ఛానల్ లో అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విశ్లేషకుడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు సహా ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడమని ఆక్షేపించారు. ఇక దీనిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతిని వేశ్యల రాజధాని అని ఎలా అంటారు..? అని మంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ఛానల్ లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే ఎలా?ఎడిటర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తారా? అని ప్రశ్నించారు. అమరావతిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని అమరావతి అంటేనే జగన్ కు అక్కసు అని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవానికి భంగం కలిగించే విధంగా ఆ వ్యాఖ్యలున్నాయని విమర్శించారు.
ఎడిటర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తారా? : ఏపీ హోం మంత్రి అనిత
By admin1 Min Read