హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ’ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటేనని తెలుగుజాతిని నెంబర్ వన్ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నేనని అలయ్ బలయ్‌తో అన్ని పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
Previous Articleఎడిటర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి అలాంటి కామెంట్స్ చేస్తారా? : ఏపీ హోం మంత్రి అనిత
Next Article ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ 2025 విజేతగా కార్లోస్ అల్కరాజ్