పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలయ్యాక తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు నాగమల్లేశ్వర రావు ఇంటిపై రాళ్లు విసిరి, అతడిని అరెస్ట్ చేయించారు. ఊళ్లోంచి వెళ్లిపోవాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కాల్చి చంపుతామని సీఐ రాజేష్ బెదిరించాడు. వాళ్ల బెదిరింపులు, అవమానాల గురించి తండ్రికి చెప్పి నాగమల్లేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుల ప్రస్తావన తెచ్చి, అవమానించి, తిట్టి కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారని ఆరోపించారు. వీరి ఇంటిపై దాడి చేసిన వారిలో ఎందరిని అరెస్ట్ చేశారు, ఎందరికి శిక్ష వేశారు అని ప్రశ్నించారు. వేధించిన సీఐ మీద ఏం చర్యలు తీసుకున్నారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
By admin1 Min Read
Previous Articleకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశం
Next Article 2026 మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల