మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసీసీ మరియు ఆతిథ్యం ఇవ్వనున్న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించాయి. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 12 జట్లు తలపడనున్నాయి. వచ్చే ఏడాది జూన్ 12న ప్రారంభం కానుంది. మొత్తంగా 33 మ్యాచ్ లు 7 వేదికలలో జరగనున్నాయి. ఎడ్జ్ బాస్టన్, హాంప్ షైర్, హెడింగ్లీ, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, ఓల్డ్ ట్రాఫోర్డ్, లార్డ్స్ లలో మ్యాచ్ లు జరుగుతాయి. జూన్ 30, జులై 2న సెమీ ఫైనల్స్, జులై 5న ఫైనల్ జరగనున్నాయి. ఇక 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1 లో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా మరియు రెండు క్వాలిఫైయింగ్ జట్లు, గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, రెండు క్వాలిఫైయింగ్ జట్లు ఉంటాయి. జూన్ 14న ఎడ్జ్ బాస్టన్ లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు