టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 465 (100.4 ఓవర్లలో) పరుగులకు ఆలౌటయింది. పోప్ 106 (137;4×4) సెంచరీతో రాణించాడు. బ్రూక్ 99 (112; 11×4, 2×6) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. డకెట్ (62) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో స్మిత్ (40), వోక్స్ (38), రూట్ (28), కార్సే (22), స్టోక్స్ (20) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు. భారత బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులతో ఉంది. జైశ్వాల్ (4), సాయి సుదర్శన్ (30) పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కే.ఎల్.రాహుల్ 47 నాటౌట్ (75; 7×4), శుభ్ మాన్ గిల్ 6 నాటౌట్ గా ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు