ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది.
ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు:
రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం.
మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
పురపాలకశాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్ కు ఆమోదం
భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు ఆమోదం.
టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం.
పర్యాటక ప్రాంతం గండికోట వద్ద రిసార్టు ఏర్పాటు కోసం 50 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం.
తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటకశాఖకు బదిలీకి అనుమతి.
శ్రీశైలం డ్యామ్, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ సేఫ్టీ పనుల కోసం 350 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం.
ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా పోలవరం బసకచర్ల ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం.
విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి ఎపీ కల్చరల్ విభాగానికి బదిలీ చేయాలని నిర్ణయం.
పెండింగ్ పనులను ఏపీ కల్చరల్ విభాగం ద్వారా నిధులిచ్చి పూర్తి చేయాలని నిర్ణయం.
రాజధానిలో అమరావతిలో అన్ని హంగులతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి నిర్ణయం
ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
రాష్ట్రంలో 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం.
విశాఖ మధురవాడలో 22.19ఎకరాల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేస్తూ రూ.1582 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.
రాజధాని అమరావతిలో ఈ3 రోడ్డును ఎన్ హెచ్ 16కు అనుసంధానించేందుకు రూ.682 కోట్ల టెండర్లు ఆమోదానికి పరిపాలన అనుమతి.
ఎపీ మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు కోసం రూ.273.17 కోట్లు మంజూరుకు పరిపాలన పరమైన అనుమతులు
రాష్ట్రంలో 20 మిలియన్ టన్నుల పొగాకును రాష్ట్ర ప్రభుత్వం సేకరించాలని నిర్ణయం.
వచ్చే ఏడాది పొగాకు సాగుకు క్రాప్ హాలిడే ఇవ్వాలని నిర్ణయం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు