భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా.. గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు.. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్ లను నియమించారు. అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులైన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు హార్షం వ్యక్తం చేశారు.
గోవా గవర్నర్‌గా నియమితులైన పి. అశోక్ గజపతి రాజుకు హృదయపూర్వక అభినందనలు. ఇది మన రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమైన క్షణం. ఈ గౌరవాన్ని ఆయనకు అందించినందుకు గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మరియు కేంద్ర మంత్రివర్గానికి ఏపీ సీఎం చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవనీయమైన పదవిలో రాజు గారు విజయవంతంగా మరియు సంతృప్తికరంగా పదవీకాలం కొనసాగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

