వెస్ట్ ఇండోనేషియాలో నేటి మధ్యాహ్నం 12:49 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. దీని కారణంగా అనేక నివాసాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వారు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ లు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపం కారణంగా ఒక్క ఇండోనేషియాలోనే 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్‌లో ఉంది. ఇండోనేసియాలో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వస్తుంటాయి.
Previous Articleఅరకును కాఫీ బ్రాండ్ గా తీర్చిదిద్దాం:హోం మంత్రి అనిత
Next Article గోవా గవర్నర్‌గా నియమితులైన అశోక్‌గజపతిరాజు