ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా వీరిరువురూ భేటీ అయ్యారు. పలు అంశాలను కేంద్ర హోం మంత్రి దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా పలు అంశాలపై ఆయనతో మాట్లాడారు. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ఇటీవల గోవా గవర్నర్ గా నియమించిన నేపథ్యంలో అమితాకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ధ్వంసమైన ఆర్థికవ్యవస్థను కేంద్రం అండతో గాడిలో పెడుతున్నామని అమిత్ షా కు చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మరింత సహకారం అందించాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును రూ.82వేల కోట్లతో ప్రతిపాదించినట్లు తెలిపారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందన్నారు. ఏపీ ఎదుర్కొంటున్న నష్టంపై ఆర్థిక సంఘానికి నివేదించినట్లు అమిత్ షా కు సీఎం తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు